loader

తడబడిన భారత్​- 76 రన్స్​ తేడాతో ఘనవిజయం సాధించిన దక్షిణాఫ్రికా

టీ20 వరల్డ్ కప్​ మ్యాచ్​లో భారత్​పై 76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 188 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ పూర్తిగా తడబడింది. కాగా 188 పరుగుల లక్ష్యంతో దిగిన భారత్​ అంచనాలకు తగిన విధంగా ఆడలేకపోయింది. భారత ఓపెనర్లు మరోసారి నిరాశపరిచారు. ఇషాన్ కిషన్ డకౌట్ అవ్వగా, అభిషేక్ శర్మ 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ (1), వాషింగ్టన్ సుందర్ (11), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ […]

మాస్కో ఎయిర్‌పోర్టుల మూసివేత

ఉక్రెయిన్ డ్రోన్ దాడులు ఇతర భద్రతా కారణాలతో మాస్కోలో సోమవారం నాలుగు అంతర్జాతీయ విమానాశ్రాయాలను మూసివేశారు. మూసివేతకు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. రాజధాని మాస్కో పరిధిలోకి వచ్చే డోమోడెడోవో, వినుకోవో, జుకోవ్‌స్కీ, షెరెమిటైవో ఎయిర్‌పోర్టులలో పూర్తి స్థాయి వైమానిక ప్రయాణ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నానికి 11 ఉక్రెయిన్ డ్రోన్లను వేర్వేరు ప్రాంతాలలో నేలకూల్చాయి. కొన్ని శత్రు డ్రోన్లు మాస్కో గగనతలం వైపు దూసుకువస్తున్నట్లు తెలియడంతోనే భద్రతా కారణాలతో విమానాశ్రాయాలలో రాకపోకలను తదుపరి ప్రకటన వెలువడే […]

ట్రంప్ రిసార్ట్​లోకి చొరబడిన సాయుధుడు- కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్​ ఏజెంట్లు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్‌ వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని దాటుకుని ఓ సాయుధుడు లోపలికి ప్రవేశించాడు. ‘నిందితుడు మార్-ఎ-లాగో ఉత్తర ద్వారం వద్ద అనుమానాస్పదంగా కనిపించాడు. అతని చేతిలో ఒక షాట్ గన్, ఇంధనంతో కూడిన డబ్బా (ప్యూయెల్ క్యాన్​) ఉన్నట్లు గుర్తించారు. అతనిని లొంగిపోమని భద్రతా సిబ్బంది హెచ్చరించినప్పటికీ, సాయుధుడు రిసార్ట్​లోకి చొరబడడంతో,  దీనితో అప్రమత్తమైన యూఎస్​ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిని కాల్చి చంపారు.

నేను మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే.. షేక్ చేస్తున్న పవన్‌ కల్యాణ్‌

హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తోన్న చిత్రం ఉస్తాద్‌ భగత్‌ సింగ్  మూవీ నుంచి Aura Of Ustaad సాంగ్ ప్రోమో విడుదల చేయగా నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తాజాగా మేకర్స్‌ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను లాంచ్ చేశారు. Aura Of Ustaad సాంగ్ నేను మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే.. అభిమానులు ఆశించే ఎలిమెంట్స్‌తో ఉండబోతుందని విజువల్స్‌ చెబుతున్నాయి.  చంద్రబోస్ రాసిన ఈ పాటను DSP కంపోజిషన్‌లో పీ అభిషేక్ అండ్ […]

ఇరాన్‌లో కదంతొక్కిన విద్యార్థులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో ఆందోళనలు ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇరాన్‌లో వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కారు. ప్రభుత్వాధినేత ఖమేనీకి, అతడి పాలనకు వ్యతిరేకంగా శనివారం నినదించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్, మషాద్ పట్టణాల్లో విద్యార్థులు, యువత వీధుల్లోకి చేరి నిరసనలు చేపట్టారు. సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేయాలని, అతడి పాలన నుంచి తమకు స్వేచ్ఛ కావాలని, అలాగే ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం […]

దేవాదుల పనులపై సీఎం రేవంత్ రెడ్డి గడువు

దేవాదుల పనులపై సీఎం రేవంత్ రెడ్డి గడువు విధించారు. జూన్ 2 లోపు భూసేకరణ పూర్తికి ఆదేశించారు. దేవాదుల ఎత్తిపోతల పథకంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారకూడదని, రైతుల ప్రయోజనాలే పరమావధిగా పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టులో నిలిచిపోయిన పంప్‌లకు నెల రోజుల్లోపు మరమ్మతులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

ఏపీ సీఎం చంద్రబాబుకు తాము సహకరిస్తున్నామన్నది ‘చౌకబారు విమర్శ’: సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లా పర్యటన సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులు, రాజకీయ విమర్శలపై సూటిగా స్పందించారు. గత ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతూనే, రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్మాణాత్మక సూచనలను స్వీకరించడానికి తాము సిద్ధమని ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తాము సహకరిస్తున్నామనే విమర్శలను ‘చౌకబారు విమర్శలు’గా సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. పక్క రాష్ట్రాలతో చర్చించి తెలంగాణ నీటి హక్కులను కాపాడతామని స్పష్టం చేశారు.

దంచేసిన మిల్లర్, బ్రెవిస్.. భారీ స్కోర్‌తో సవాల్ విసిరిన దక్షిణాఫ్రికా..!

సూపర్ 8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా హిట్టర్లు చెలరేగిపోయారు. పవర్ ప్లే కింగ్ బుమ్రా(3-15)  టాపార్డర్‌ను కూల్చినా.. డేవిడ్ మిల్లర్(63), డెవాల్డ్ బ్రెవిస్(45) విధ్వంసక ఆటతో రెచ్చిపోయారు. 20కే మూడు వికెట్లు పడినా..  ఈ ద్వయం మిడిల్ ఓవర్లలో బౌండరీల మోత మోగించింది. నాలుగో వికెట్‌కు 97 రన్స్ జోడించిన ఈ జోడీ వెనుదిరిగాక.. సఫారీల స్కోర్ వేగానికి బుమ్రా, అర్ష్‌దీప్ కళ్లెం వేశారు. అయినా.. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్‌(44 నాటౌట్) దంచేయడంతో మర్క్‌రమ్ సేన7 వికెట్ల […]

భారత్ నెట్ ఒప్పందంతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విప్లవం: సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్‌కు కీలక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అప్పట్లో బ్యాండ్‌విడ్త్ కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్లమని గుర్తుచేశారు. అమరావతి వేదికగా ఐబీఎం , టీసీఎస్, ఎల్అండ్‌టీలతో కలిసి ఈ ఏడాది చివరి నాటికి భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్‌ను ప్రారంభించబోతున్నాం’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

వరల్డ్‌కప్ ట్రోఫీతో గూగుల్ సీఈవో..

అహ్మదాబాద్‌లో భారత్, దక్షిణాఫ్రికా సూపర్ 8 మ్యాచ్‌ సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్‌ తో కలిసి ప్రపంచకప్‌ను మైదానంలోని తీసుకువచ్చారు. భారత పర్యటనలో ఉన్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తనకు ఆటపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుందర్‌కు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ క్రికెట్ పాఠాలు నేర్పారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON