అహ్మదాబాద్‌లో భారత్, దక్షిణాఫ్రికా సూపర్ 8 మ్యాచ్ సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ తో కలిసి ప్రపంచకప్‌ను మైదానంలోని తీసుకువచ్చారు. భారత పర్యటనలో ఉన్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తనకు ఆటపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుందర్‌కు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ క్రికెట్ పాఠాలు నేర్పారు.

