loader

డీఎంకే తీర్థం పుచ్చుకున్న మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అరుదైన, ఊహించని అధ్యాయం మొదలైంది. దివంగత జయలలితకు నమ్మిన బంటుగా, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే) సీనియర్ నేత ఓ పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) శుక్రవారం అధికార డీఎంకే పార్టీలో చేరారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పదుల సంఖ్యలో ఉన్న తన మద్దతుదారులతో కలిసి వచ్చిన ఓపీఎస్‌కు స్టాలిన్ ఘన స్వాగతం పలికారు.

దిల్లీ మద్యం పాలసీ కేసు – రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు బిగ్​ రిలీఫ్

దిల్లీ మద్యం పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు దిల్లీ రౌస్​ అవెన్యూ కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో అభియోగాలు మోపిన 23 మందికి కోర్టు విముక్తి కల్పించింది. ఈ మేరకు నిందితుల పేర్లను డిశ్చార్చ్​ చేస్తూ రౌస్​ అవెన్యూ కోర్టు ఉత్తర్వులను వెలువరించింది. సరైన ఆధారాలు లేకుండానే కేసులో పేర్లు చేర్చారని సీబీఐపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తిగా లోపభూయిష్టమైన దర్యాప్తు జరిగిందని సీబీఐపై అసహనం వ్యక్తం చేసింది.

12వ రోజు ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నేడు 12వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ(శుక్రవారం) శాఖల వారీగా బడ్జెట్‌ పద్దులపై చర్చ, ఆమోదం తెలపనున్నారు. వ్యవసాయ, గృహ నిర్మాణం శాఖకు సంబంధించిన పద్దులను మంత్రులు అచ్చెన్నాయుడు, పార్థసారథి ప్రవేశపెట్టనున్నారు. పురపాలక శాఖ వార్షిక నివేదికను మంత్రి నారాయణ సభలో ప్రవేశ పెట్టనున్నారు.

జగన్ రాయలసీమకు ద్రోహం చేశారు: నిమ్మల

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసిపి అబద్ధాలు చెబుతోందని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే మాజీ మంత్రి వైసిపి జగన్ మోహన్ రెడ్డి ఏం చేశారని..ఈ ఐదేళ్లు వైసిపి నాయకులు ఏం చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. ఎపి శాసనమండలిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై టిడిపి, వైసిపి సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. 2020 లోనే రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ పనులు నిలిపి వేశారని విమర్శించారు. అప్పుడు జగన్ సిఎంగా […]

పులివెందులలో నందీశ్వర ఆలయంలో హోమం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రెండు రోజుల పులివెందుల పర్యటనలో భాగంగా బుధవారం వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలోని నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న శాస్త్రోక్త కార్యక్రమాల్లో భాగంగా జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించిన హోమంలో ఆయన పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు.

విశాఖ, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులు – కేబినెట్ నిర్ణయాలివే

విశాఖ, తిరుపతి, కాకినాడ, సత్యసాయి జిల్లా, చీరాల, రాజమహేంద్రవరంలో పర్యాటక ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 55 అజెండా అంశాలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 160 మెగావాట్లు, 125 మెగావాట్లు ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

వాళ్లు ఎవరికీ భయపడని బబ్బర్ షేర్స్.. రాహుల్ కితాబు

ఢిల్లీలోని భారత్ మండపంలో ఫిబ్రవరి 10న జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో చొక్కాలు విప్పి నిరసనలు తెలిపిన ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఐవైసీ కార్యకర్తలకు సమర్ధనగా ‘యూత్ కాంగ్రెస్ సభ్యులంతా బబ్బర్ షేర్‌లు. మీరు ఎవరికీ భయపడాల్సిన పని లేదు. మీలో దేశభక్తి రక్తం ఉంది. మీరు హరిత విప్లవం తీసుకువచ్చారు. పరిశ్రమలు తీసుకొచ్చారు. ఐటీ విప్లవం తెచ్చారు. వీటన్నింటికీ మోదీ చరమగీతం పాడారు’ అని రాహుల్ అన్నారు.

హెరిటేజ్‌పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెరిటేజ్ సంస్థపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సంస్థ పేరును దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. తాను రాజకీయాల్లో ఉన్నందున ఎలాంటి వివాదాలు రాకూడదనే ఉద్దేశంతో దేవాలయాలకు పాలు, నెయ్యి సరఫరా చేయకుండా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇది పూర్తిగా పారదర్శకత కోసం తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. ఇందాపూర్ వ్యవహారంలో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని సీఎం స్పష్టంగా తెలిపారు.

మీ ఆస్తులు ప్రకటిస్తారా… స్టాలిన్‌కు విజయ్ సవాల్

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌పై తమిళగగ వెట్రి కళగం (TVK) చీఫ్ విజయ్ విమర్శల దాడి పెంచారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్నందుకే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని విజయ్ ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామని ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు ముఖ్యమంత్రికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఇప్పుడెన్ని ఆస్తులున్నాయో వెల్లడించాలని సవాలు చేశారు. వేలూరులో సోమవారంనాడు నిర్వహించిన బహిరంగ సభలో విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అలా అయితే ఫైనల్స్​కు​ వెళ్తా – వస్తానంటే పులివెందుల ఎమ్మెల్యేను తీసుకెళ్తా: మంత్రి లోకేశ్

కిలో నెయ్యి 360 రూపాయలకు ఎక్కడ దొరికినా అది కల్తీదే అన్నారు. మార్కెట్​లో కిలో నెయ్యి 1000 రూపాయలు పైన ఉంటే రూ.360కి ఇచ్చేది కల్తీకాక మరేంటని? ప్రశ్నించారు. టీ20 ప్రపంచ కప్​లో ఇండియా ఫైనల్స్​కు వెళ్తే మ్యాచ్ చూసేందుకు తప్పనిసరిగా వెళ్తా అన్నారు. పులివెందుల ఎమ్మెల్యే వస్తానంటే ఆయనకు టికెట్ కూడా తానే తీసుకుంటాని వెల్లడించారు. బడ్జెట్ మీద చర్చ కావాలని మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు అడగడం హాస్యాస్పదమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON