loader

జింబాబ్వేపై భారత్ ఘన విజయం

సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్​లో టీమ్ఇండియా అదరగొట్టింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్​లో భారత్ 72 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. 257 పరుగుల భారీ ఛేదనలో జింబాబ్వే ఓనర్లన్నీ ఆడి 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితం అయ్యింది. బ్రియాన్ బెన్నెట్ (97* పరుగులు) భారీ ఇన్నింగ్స్ వృథా అయ్యింది. టీమ్ఇండియా బౌలర్లలో అర్షదీప్ 3, వరణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.

తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని స్వీకరించరు : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని స్వీకరించరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడేవారు శ్రీమంతులు కాదని పేర్కొన్నారు. సమక్క, సారక్క, కాకతీయులు ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్​ను ప్రక్షాళన చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు.  గ్రూప్–1, 2 అధికారుల వెలిడిక్టరీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇందులో 271 మంది గ్రూప్–1, 171 మంది గ్రూప్–2 అధికారులు, 51 మంది మిలటరీ ఇంజినీరింగ్ సర్వీస్ ఉద్యోగులు ఉన్నారు.

ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా

కేరళం త్రిస్సూర్ జిల్లాలోని అన్నమనాడ గ్రామంలోని మహాదేవ ఆలయం ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు నిర్వహించేందుకు ఏనుగులను దేవతా విగ్రహాన్ని ఊరేగింపునకు సిద్ధం చేసే క్రమంలో ఓ పూజారి ఏనుగుపై కూర్చోగా.. పక్కన ఉన్న వారు ఏనుగు పక్కనే నిలబడ్డారు. అయితే అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఏనుగు.. ఒక్కసారిగా రెచ్చిపోయింది. పక్కనే నిలబడ్డ పూజారిని తొండంతో పట్టుకుని గాల్లోకి లేపింది. ఆ తర్వాత.. అంతా చూస్తుండగానే అతన్ని దూరంగా విసిరేసింది. తీవ్రగాయాలపాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

‘మా కుమార్తె చికిత్సకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ – పునర్విక తల్లీదండ్రులు

చిన్నారి పునర్విక పేరు గత కొద్ది రోజులుగా వైరలవుతోంది. ఈ పసి ప్రాణానికి పునర్జన్మను ఇవ్వడం కోసం 2 తెలుగు రాష్ట్రాల యువత కలిసి విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిన్నారి తల్లీదండ్రులు సురేష్, పుప్పావతి దంపతులు ధన్యవాదాలు తెలిపారు. పాప ఆరోగ్యం కోసం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినవారు, ప్రార్థించిన వారు, రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి లోకేశ్​కి, దాతలందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు.

గతేడాది ఇండియా లో ఎంతమంది విడాకులు తీసుకున్నారో తెలుసా ?

భారతదేశంలో మారుతున్న సామాజిక పరిస్థితులు మరియు మారుతున్న జీవనశైలి కారణంగా విడాకుల కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గతేడాది దేశవ్యాప్తంగా సుమారు 8.27 లక్షల విడాకుల కేసులు నమోదు కావడం గమనార్హం. ఇందులో మహారాష్ట్ర 18.7 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, కర్ణాటక (11.7%), తెలంగాణ (6.7%) రాష్ట్రాలు మొదటి ఆరు స్థానాల్లో నిలిచాయి. సుమారు 33.2 శాతం మంది దంపతులు పరస్పర అంగీకారంతో విడిపోతుండగా, మిగిలిన కేసులు గృహహింస, వివాహేతర సంబంధాలు మరియు క్రూరత్వం వంటి తీవ్రమైన […]

భారత్–ఇజ్రాయెల్ కీలక ఒప్పందాలు, AI నుంచి రక్షణ వరకూ!

ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా భారత్–Israel మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. కృత్రిమ మేధ (AI), వ్యవసాయం, రక్షణ, సాంకేతికత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచేందుకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు కూడా తుది దశకు చేరుకున్నాయి. మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా క్షిపణులు, డ్రోన్ల సాంకేతికత బదిలీపై అవగాహన కుదిరింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో సంయుక్త పరిశోధనలకు ఒప్పందం కుదిరింది.

శిశు సంక్షేమంలో కోనసీమ కొత్త అధ్యాయం..15 నెలల సంజనకు కొత్త కుటుంబం..

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొలిసారిగా అద్బుత ఘట్టం ఆవిష్కృతమైంది. కోనసీమ శిశు గృహం ద్వారా తొలిసారిగా ఒక ఆడశిశువును దత్తతకు ఇచ్చినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు.కేరళకు చెందిన దంపతులు CARA (Child Adoption Resource Authority) పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసి, 15 నెలల చిన్నారి సంజనను బుధవారం వారికి అప్పగించారు. ఈ దత్తత అనుబంధం రాష్ట్రంలో శిశు సంరక్షణ మరియు దత్తత విధానంలో ఒక సానుకూల ప్రగతిని సూచిస్తున్నదని కలెక్టర్ అన్నారు.

భార్య ప్రియుడ్ని కాల్చి చంపిన వ్యక్తి.. బీడీ వెలిగించిన తర్వాత పొలీసులకు లొంగుబాటు

భార్య ప్రియుడ్ని ఒక వ్యక్తి కాల్చి చంపాడు. పారిపోయిన అతడ్ని పోలీసులు చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో బీడీ వెలిగించిన తర్వాత అతడు లొంగిపోయాడు. దీనికి ముందు భార్యను కూడా చంపుతానని ఒక వీడియోలో హెచ్చరించాడు. ఏడాదన్నర కిందట భార్య అతడ్ని వీడి సురేంద్రతో కలిసి నివసిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న ప్రదీప్‌ తన భార్య ప్రియుడైన సురేంద్రను కాల్చి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.

విమాన టికెట్..రీఫండ్ రూల్స్‌లో మార్పులు..48 గంటల్లోపు క్యాన్సిల్ చేస్తే..

క్యాన్సిలేషన్ నిబంధనలు మార్పు: -ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాక 48 గంటల్లోపు క్యాన్సిల్ చేసుకోవచ్చు.. ఇందుకు ఎటువంటి ఎక్స్‌ట్రా చార్జీలు చెల్లించాల్సిన అవసం లేదు -విమానయాన సంస్థలు 14 రోజుల్లోపు రీఫండ్ ప్రాసెస్ పూర్తి చేయాలి -టికెట్ బుక్ చేసుకున్న తర్వాత 24 గంటల్లోపు సాధారణ పేరు మార్చుకునేందుకు ఎలాంటి ఛార్జ్ విధించకూడదు -ఎయిర్‌లైన్ సొంత వెబ్ సైట్, యాప్‌ల ఆధారంగా చేసుకున్న బుకింగ్స్‌కు ఈ రూల్స్ వర్తిస్తాయి

‘నా భర్త మిస్టర్ విజయ్ దేవరకొండ’- పెళ్లి ఫొటోలు షేర్ చేసిన రష్మిక మంధన్నా

విజయ్ దేవరకొండ- రష్మిక మంధన్నా పెళ్లి ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా గురువారం ఉదయం 10.10 గంటలకు హిందూ సంప్రదాయంలో వివాహం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను రష్మిక తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘నా భర్త, మిస్టర్ విజయ్ దేవరకొండను మీ అందరికీ పరిచయం చేస్తున్నాను’ అని క్యాప్షన్ రాసుకొచ్చారు. రష్మిక రెడ్ కలర్ శారీలో కనిపించడగా, విజయ్ సంప్రదాయ పంచకట్టులో ఉన్నారు. రాజసం ఉట్టిపడేలా విజయ్ కాళ్లు, చేతులకు కడియాలు, […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON