loader

ఈ ప్రభుత్వానికి మద్దతు బాధగా ఉంది…కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అయితే బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌పై కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ సంచలన కామెంట్స్ చేశారు. తాను భాగస్వామిగా ఉన్న ఎన్డీయే సర్కార్‌పైనే ఆయన విమర్శలు గుప్పించారు. పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంతో నితీష్ సర్కార్ విఫలమైందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో అలాంటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు క్షమించండి అని అన్నారు.

మోదీలో దమ్ము లేదు- రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో జరిగిన ‘న్యాయ్ సమ్మేళన్’ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్, మోదీపై నిశితంగా వ్యాఖ్యలు చేశారు. “నిజం చెప్పాలంటే మోదీకి ధైర్యం లేదు. ఆయనపై క్రియేట్ అయ్యే హైప్ అంతా మీడియా ద్వారా. అంతా ఒక షో మాత్రమే,” అని అన్నారు. “అయనను దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది. మోదీ నిజమైన నాయకత్వ లక్షణాలు కలవాడు కాడు. ప్రజల్లో భయం కలిగించేలా ఆయనను మీడియా […]

సాయిలన్నపై దాడికి బదులు తీర్చుకుందాం..కేటీఆర్ పిలుపు

మాజీ ఎంపీపీ సాయిలన్నకు జరిగిన అన్యాయం ఎవ్వరికీ జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దళిత వ్యతిరేకి కాంగ్రెస్‌ను గద్దె దించుదామని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన ఆత్మ గౌరవ గర్జన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ చేతిలో అవమానానికి గురైన దళిత బిడ్డ ముదాం సాయిలను కేటీఆర్ సన్మానించారు. సాయిలు బట్టలిప్పి అవమానించినట్లు.. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

క్యూలైన్‌లో ఉన్న ఈ చెప్పులే.. చెప్పుల దండలుగా మారే రోజు దగ్గర్లోనే ఉంది.. హెచ్చరించిన కేటీఆర్

ిప్యూటీ సీఎం.. వ్యవసాయ శాఖ మంత్రుల ఇలాకాలోనూ రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం చెప్పులు క్యూలైన్‌లో పెట్టి మరీ పడిగాపులు కాస్తున్నారు. బస్తా ఎరువు కోసం రైతు బతుకు బరువు చేస్తావా అని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు. క్యూలైన్‌లో ఉన్న ఈ చెప్పులే.. చెప్పుల దండలుగా మారే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఈ చేతకాని పాలనపై చెలరేగడం ఖాయమని.. పాలకుల చెంపలు చెళ్లుమనిపించడం తథ్యమని స్పష్టం చేశారు.

ఇందిరా రికార్డును మోదీ బద్దలు భారత చరిత్రలో అరుదైన ఘనత!

దేశానికి అత్యధిక కాలం పాటు ప్రధానిగా సేవలందించిన నాయకుల్లో ఆయన ఇప్పుడు రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పేరున ఉండగా, జూలై 25వ తేదీ నాటికి మోదీ 4,078 రోజులు పూర్తి చేసుకొని ఆమెను ఒక రోజు అధిగమించారు. ఇందిరా గాంధీ మొత్తం 4,077 రోజులు ప్రధానిగా పనిచేశారు. ప్రస్తుతం దేశానికి అత్యధికకాలం సేవలందించిన ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ (6,130 రోజులు) అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఘనత మోదీకి […]

రాజ్యసభ ఎంపీగా కమల్‌హాసన్ ప్రమాణస్వీకారం

ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ తాజాగా రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. తమిళనాడు ప్రభుత్వ మద్దతుతో, ముఖ్యంగా డీఎంకే పార్టీ మద్దతుతో కమల్‌హాసన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రత్యేకంగా తమిళ భాషలో ఆయన ప్రమాణస్వీకారం చేయడం విశేషంగా నిలిచింది.

రేవంత్ అంచనాలకు మించి రాణించారు- కులగణనపై రాహుల్ ప్రశంసలు

ఢిల్లీలో జరిగిన కులగణనపై కాంగ్రెస్ ఎంపీలకు వర్క్ షాప్ లో ఇచ్చిన ప్రజెంటేషన్ సమయంలో రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ప్రసంసించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ నేతలు అంచనాలకు మించి రాణించారన్నారు. కులగణన నిర్వహించడం అంత తేలిక కాదు..రేవంత్‌రెడ్డి విజయవంతంగా సర్వే చేపట్టారున్నారు. దేశంలో తెలంగాణ కులగణన నిర్వహణకు ఇది మార్గదర్శిగా నిలుస్తుందన్నారు

కేటీఆర్‌ను ఆశీర్వదించిన కేసీఆర్ దంప‌తులు

తన పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. త‌న‌ తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య శైలిమ, కుమారుడు హిమాన్షుతో ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్, తన తల్లిదండ్రులను కలిసి వారికి పాదాభివందనం చేశారు.ఈ సందర్భంగా వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కేసీఆర్,శోభమ్మ దంపతులు కేటీఆర్‌ను ఆశీర్వదించారు.

కేటీఆర్ బర్త్‌డే.. విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ.

కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఒక మంచి పనికి వేదికయ్యాయి. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ‘గిఫ్ట్ ఏ స్మైల్’ ద్వారా విద్యార్థులకు సహాయం చేశారు. బోయిగూడలోని సెయింట్ ఫిలోమెనాస్ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో.. విద్యార్థుల సౌకర్యార్థం 100 బెంచీలను అందించారు. అంతేకాకుండా.. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువులో తొలి రెండు స్థానాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు 20 సైకిళ్లను బహుకరించారు.

బిహార్‌లో ఎన్నికల బహిష్కరణ దిశగా సంకేతాలు.. తేజస్వీ

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) బీజేపీ ఆదేశాల ప్రకారమే నడుస్తోందని, ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం వ్యర్థమని అన్నారు. ‘‘నకిలీ ఓటర్ల జాబితాల ఆధారంగా అధికారాన్ని కొనసాగించాలనుకుంటే, ఎన్నికల అవసరం ఏముంది? నేరుగా బీజేపీ ప్రభుత్వాన్ని పొడిగించండి’’ అని తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. ‘‘ఎన్నికల బహిష్కరణ ఓ ఎంపికే. కానీ, మేము మిత్రపక్షాలతో, ప్రజలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం’ అన్నారు. ఈ వ్యాఖ్యలతో ప్రతిపక్షాలు బిహార్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON