దేశానికి అత్యధిక కాలం పాటు ప్రధానిగా సేవలందించిన నాయకుల్లో ఆయన ఇప్పుడు రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పేరున ఉండగా, జూలై 25వ తేదీ నాటికి మోదీ 4,078 రోజులు పూర్తి చేసుకొని ఆమెను ఒక రోజు అధిగమించారు. ఇందిరా గాంధీ మొత్తం 4,077 రోజులు ప్రధానిగా పనిచేశారు. ప్రస్తుతం దేశానికి అత్యధికకాలం సేవలందించిన ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ (6,130 రోజులు) అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఘనత మోదీకి అనేక కోణాల్లో ప్రత్యేకంగా నిలుస్తోంది.

