ిప్యూటీ సీఎం.. వ్యవసాయ శాఖ మంత్రుల ఇలాకాలోనూ రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం చెప్పులు క్యూలైన్‌లో పెట్టి మరీ పడిగాపులు కాస్తున్నారు. బస్తా ఎరువు కోసం రైతు బతుకు బరువు చేస్తావా అని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు. క్యూలైన్‌లో ఉన్న ఈ చెప్పులే.. చెప్పుల దండలుగా మారే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఈ చేతకాని పాలనపై చెలరేగడం ఖాయమని.. పాలకుల చెంపలు చెళ్లుమనిపించడం తథ్యమని స్పష్టం చేశారు.

