కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) బీజేపీ ఆదేశాల ప్రకారమే నడుస్తోందని, ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం వ్యర్థమని అన్నారు. ‘‘నకిలీ ఓటర్ల జాబితాల ఆధారంగా అధికారాన్ని కొనసాగించాలనుకుంటే, ఎన్నికల అవసరం ఏముంది? నేరుగా బీజేపీ ప్రభుత్వాన్ని పొడిగించండి’’ అని తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. ‘‘ఎన్నికల బహిష్కరణ ఓ ఎంపికే. కానీ, మేము మిత్రపక్షాలతో, ప్రజలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం’ అన్నారు. ఈ వ్యాఖ్యలతో ప్రతిపక్షాలు బిహార్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

