ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ తాజాగా రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. తమిళనాడు ప్రభుత్వ మద్దతుతో, ముఖ్యంగా డీఎంకే పార్టీ మద్దతుతో కమల్‌హాసన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రత్యేకంగా తమిళ భాషలో ఆయన ప్రమాణస్వీకారం చేయడం విశేషంగా నిలిచింది.