loader

మళ్లీ మొదలైన కరోనా భయం

ఇండియాలో కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. అప్పుడే 257 కొత్త కరోనా కేసులు వెలుగు చూడటం ఆందోళన కల్గిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, నటి శిల్పా శిరోద్కర్ వంటి ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా 257 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ కొత్త కేసులు నమోదయ్యాయి.

వైద్య కళాశాలలకు ఇక రేటింగ్‌

ఇండిపెండెంట్‌ థర్డ్‌ పార్టీ ద్వారా దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో పరిశీలన చేయించి వాటికి అధికారిక గుర్తింపు(అక్రిడియేషన్‌), రేటింగ్‌ ఇవ్వాలని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మెడికల్‌ అసెస్‌మెంట్‌, రేటింగ్‌ బోర్డ్‌ రూపొందించిన మొత్తం 11 ప్రమాణాలు, 78 పారామితులతో ఒక ముసాయిదాను విడుదల చేసింది. వైద్య కళాశాలలు అత్యున్నత ప్రమాణాలు సాధించడం కోసం అవి జవాబుదారీతనం, నిబద్ధతతో పనిచేసేలా చేసేందుకు రేటింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ఎన్‌ఎంసీ అధ్యక్షుడు గంగాధర్‌ తెలిపారు.

తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు డీజిల్‌ కష్టాలు

గర్భిణులు, బాలింతలను ఇండ్లకు చేర్చే ‘తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలకు డీజిల్‌ కష్టాలు ఎదురయ్యాయి. డీజిల్‌ లేక వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆదోని ప్రభుత్వ స్త్రీల, చిన్నపిల్లల ఆస్పత్రిలో ఏడు‘తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ’ వాహనాలు ఉన్నాయి. హొళగుందకు చెందిన బేబీ అనే బాలింత ‘తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ డ్రైవర్‌ దగ్గరకు వెళ్లి వేడుకుంది. ఆయన మాత్రం స్పందించలేదు.

డయాబెటిస్ రోగులకు భరోసా.. ఉచితంగా ఈ ఆసుపత్రుల్లో చికిత్స..

కేంద్ర ప్రభుత్వం టైప్‌-1 మధుమేహం చికిత్స కోసం 8 రాష్ట్రాల్లోని 14 ఆసుపత్రులను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లుగా ఎంపిక చేసింది. ఇందులో హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు ఉన్నాయి. ఇక్కడ టైప్‌-1 డయాబెటిస్ బాధితులకు ఉచితంగా ఇన్సులిన్.. ఇతర అధునాతన వైద్య సేవలు అందించనున్నారు. ఇన్సులిన్ కోసం నెలకు సుమారు రూ. 3,000 నుండి రూ. 4,000 వరకు ఖర్చు అవుతుందని.. అయితే ప్రభుత్వం ఈ ప్రత్యేక కేంద్రాల ద్వారా ఉచితంగా మందులను అందించనున్నారు.

ఉచితంగా అవయవ మార్పిడి

పేద రోగులకు ఉచితంగా అవయవ మార్పిడి చేసేందుకు గాంధీ ఆసుపత్రి సిద్ధమవుతుంది. కార్పొరేట్‌ ఆసుపత్రుల తరహాలో నిర్మించిన ఆరు థియేటర్లు నిర్మాణపు పనులు, 95శాతం పూర్తయి అతి త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి.అవయవాల మార్పిడికోసం ఆరు మాడ్యులర్‌ ఆపరేషన్‌ థీయేటర్లు ఏర్పాటు చేశారు. ఒకేసారి మూడు వివిధ రకాల అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు. పీజీ విద్యార్థులకు వైద్యవిద్యలో భాగంగా ఆపరేషన్‌ థియేటర్‌లో నిర్వహించే అవయవ మార్పిడి చికిత్సను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాటు చేశారు. […]

‘హెచ్‌సీయూ’లో ప్రజాస్వామ్యం ఖూనీ

హెచ్‌సీయూలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అర్బన్‌ వాటర్‌ అండ్‌ క్లైమెట్‌ చేంజ్‌ నిపుణుడు బీవీ సుబ్బారావు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం మొత్తంలో ఉన్న భూవినియోగంలో 35 శాతం అడవులకు కేటాయించాలని ఆయన సూచించారు. ప్లానింగ్‌ దశలో ఐదు అంశాలను తప్పనిసరిగా జోడించాలని పేర్కొన్నారు. భూమి, నీరు, గాలి, శక్తి, ఓపెన్‌ స్పేస్‌లను ఐదు అంశాలుగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. హెచ్‌సీయూ భూమి ప్రజల ఆస్తి అని, విద్యార్థులు చేసే ఆందోళనలకు ప్రజలు కూడా బాసటగా నిలవాలని కోరారు. […]

మామూలు వాకింగ్ కన్నా రెట్టింపు ఆరోగ్యాన్నిచ్చే జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్

ముందుగా ఓ మూడు నిముషాలు మెల్లగా నడవాలి. అదే సమయంలో కండరాలన్నీ కదిలేలా చూసుకోవాలి. మూడు నిముషాలు పూర్తయ్యాక వెంటనే వేగాన్ని పెంచాలి. అంటే వేగంగా నడవాలి. దాదాపు మూడు నిముషాల పాటు ఇలా చేయాలి. ఆ తరవాత మళ్లీ మూడు నిముషాలు నెమ్మదిగా నడవాలి. ఇలా ఓ అరగంట పాటు చేస్తే చాలు. మామూలు వాకింగ్ తో వచ్చే ఆరోగ్యం కన్నా రెట్టింపు ప్రయోజనాలుంటాయని హెల్త్ ఎక్స్ పర్ట్ కశ్ ఖాన్ అంటున్నారు.

నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు పునఃప్రారంభం

ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్య శ్రీ సేవలు) నేటి నుంచి యథాతథంగా కొనసాగనున్నాయి. బకాయిలు రూ. 500 కోట్ల తక్షణం విడుదలకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దాంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నెట్‌వర్క్ హాస్పిటల్స్ సమ్మె విరమించాయి. ఎన్టీఆర్ వైద్య సేవలు మంగళవారం నుంచి ఏ ఆటంకం లేకుండా కొనసాగుతాయని పేద ప్రజలకు శుభవార్త చెప్పారు.

ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు

ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. రూ.3,500 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోకు నెట్ వర్క్ నోటీసులు ఇచ్చింది. 600 ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి.పేరుకు ఏపీ రైజింగ్ స్టేట్.. కానీ వైద్య సేవలకు దిక్కులేదు. పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదు అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యం.ఆరోగ్య శ్రీ పథకానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని […]

ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనక భవిష్యత్తు

తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2025 సంవత్సరానికి ” ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనక భవిష్యత్తు ” అనే ఇతివృత్తాన్ని ఎంచుకుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర సంబంధిత సంస్థల ప్రాయోజకత్వంలో జరుపుకునే ప్రపంచ ఆరోగ్య అవగాహన దినం.1948లో, WHO మొదటి ప్రపంచ ఆరోగ్య సభను నిర్వహించింది. 1950 నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రతి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON