loader

ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ స్పందించారు. ఇది డీలిమిటేషన్‌, మహిళల హక్కుల కోసం తీసుకొచ్చిన బిల్లు కాదన్నారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని ఓడించాయని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయమని పేర్కొన్నారు. ఎన్డీయేకు ఇది చీకటి రోజు అని, వారు తీసుకొచ్చిన బిల్లు తొలిసారిగా లోక్‌సభలో ఓడిపోయిందని విమర్శించారు.

టీసీఎస్ నిదా ఖాన్ పరారీ.. పోలీసుల రాకను పసిగట్టి చాకచక్యంగా ఎస్కేప్!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాసిక్ టీసీఎస్ లైంగిక వేధింపులు, మతమార్పిడి కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ పోలీసులకు చుక్కలు చూపిస్తోంది. ఆమె ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న తరుణంలో, పోలీసులు వస్తున్నారనే విషయాన్ని ముందే పసిగట్టిన నిదా ఖాన్ అక్కడి నుంచి చాకచక్యంగా పరారైనట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా పోలీసులు నిదా ఖాన్ భర్తను ప్రశ్నించగా, ఆయన పోలీసులకు సహకరించి ఆమె ఉంటున్న లొకేషన్‌ను వెల్లడించారు. పోలీసులు వస్తున్నారని గ్రహించిన నిదా ఖాన్, ఫోన్ […]

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ V/s ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్

మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అంశంపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం ప‌తాక స్థాయికి చేరుకుంది. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే చారిత్రక అవకాశాన్ని ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాయని, కేవలం రాజకీయ లెక్కల కోసమే దేశాభివృద్ధిని పక్కన పెట్టాయని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘నారీ శక్తి వందన్ అధినియం’ విఫలం కావడానికి ప్రతిపక్షాల తీరే కారణమని, వారికి మహిళల పట్ల […]

ప్రజలను మోసం చేయకండి.. పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ గట్టి కౌంటర్!

మోదీని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రజలకు అబద్ధాలు చెప్పవద్దని, మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని, పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గిపోతుందని, దీనిపై పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. మిమ్మల్ని డిప్యూటీ సీఎంగా గెలిపించిన ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర హక్కులను పణంగా పెట్టవద్దని హితవు పలికిన ఆయన, ఈ అంశంపై తనతో చర్చకు సిద్ధమా అంటూ #justasking హ్యాష్ ట్యాగ్‌తో […]

రెండో విడత భూ సమీకరణ రైతులతో సీఎం ప్రత్యేక భేటీ

తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం అర్ధరాత్రి సమావేశం అయ్యారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. రెండో విడత భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు కౌలును ప్రకటించారు. ఎకరానికి రూ. 40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. అలాగే కుటుంబానికి రూ. 1.50 లక్షల మేర వ్యవసాయ రుణ మాఫీకి ముఖ్యమంత్రి అంగీకారం […]

అమెరికాలో గంజాయితో పట్టుబడ్డ ఎయిరిండియా కో పైలట్

గంజాయి అక్రమ రవాణా చేస్తూ అమెరికాలో ఎయిరిండియా కోపైలట్ ఒకరు పట్టుబడ్డారు. శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్టులో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోపైలట్ స్టాఫ్ ఆన్ డ్యూటీ కింద ప్యాసింజర్ క్యాబిన్‌లో ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో అతడు విమానాన్ని నడపాల్సి ఉంది. ఈ క్రమంలో శాన్‌ఫ్రాన్సిస్కో అధికారులు జరిపిన తనిఖీల్లో అతని బ్యాగ్‌లో గంజాయి పట్టబడుంది. దీంతో అధికారులు ఎయిరిండియాకు సమాచారం అందించారు.  అనంతరం అతడిని వేరే విమానంలో భారత్‌కు […]

రాముడిపై విషం చిమ్మితే మట్టికొట్టుకుపోతారు – ప్రకాష్‌ రాజ్‌కి నాగబాబు కౌంటర్

నటుడు ప్రకాష్ రాజ్ రామాయణాన్ని వక్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఘాటుగా స్పందించారు. ‘శ్రీరామచంద్రుడు కేవలం హిందువుల దైవం మాత్రమే కాదు, ఆయన ధర్మానికి ప్రతిరూపం. రాముడిని తక్కువ చేయాలని చూడటం ధైర్యం కాదు అది అహంకారం,  రామ నామాన్ని ఎగతాళి చేసేవారు తమను తాము గాయపరుచుకుంటారు తప్ప, ధర్మాన్ని ఏమీ చేయలేరు. చరిత్రలో అధర్మం వైపు నిలిచిన వారు ఎలా కాలగర్భంలో కలిసిపోయారో, రాముడిపై విషం చిమ్మే వారి గమ్యం కూడా అలాగే […]

మేటాలో భారీ లేఆఫ్స్… 8,000 ఉద్యోగులు అవుట్

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృ సంస్థ మేటా మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. మే 20న ప్రారంభమయ్యే తొలి విడత లేఆఫ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 10 శాతం అని నివేదికలు చెబుతున్నాయి. ఏఐ ఆధారంగా సంస్థ పనితీరును మరింత సమర్థవంతంగా మార్చాలనే వ్యూహంలో భాగంగా ఉద్యోగులను తగ్గించే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మా సముద్రాన్ని కాపాడండి..

బాపట్ల జిల్లాలోని వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో పర్యాటక అభివృద్ధి పేరుతో జరుగుతున్న కార్యకలాపాల పట్ల స్థానిక మత్స్యకారులు ఆందోళనకు దిగారు. “దివే చీరాల ఎల్‌ఎల్‌పీ” పేరిట బోటింగ్ నిర్వహణకుస్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారుల సహకారంతో పనులు జరుగుతున్నాయని పనులు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్ట్ వల్ల వారి వేట మార్గాలు, పడవల నిల్వ ప్రదేశాలు దెబ్బతింటాయి. జీవనాధారం కోల్పోయే పరిస్థితి వస్తుందని మత్స్యకారులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం […]

ఆగని ట్రావెల్ బస్‌ అగ్ని ప్రమాదాలు! స్లీపర్స్‌పై నిషేధానికి పెరుగుతున్న డిమాండ్

గచ్చిబౌలి నుండి పాలకొల్లుకు బయల్దేరిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సుకొండాపూర్, మియాపూర్ మీదుగా కేపీ హెచీ (KPHB) ప్రాంతానికి చేరుకోగానే, ఇంజిన్ భాగంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. బస్సులో పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని నిలిపివేసి, ప్రయాణికులను కిందకు దిగిపోవాల్సిందిగా హెచ్చరించారు. అందరూ కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON