loader

మధ్యప్రదేశ్‌లో భారీ చోరీ.. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు ముమ్మరంగా వేట

మధ్యప్రదేశ్‌లో సింగ్రౌలీ జిల్లా బైదాన్‌ పట్టణంలోని వింద్యానగర్‌ ఏరియా లోగల బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర బ్రాంచ్‌లో దోపిడీ దొంగలు చొరబడి నగదుతోపాటు లాకర్‌లలోని బంగారం, వెండి ఎత్తుకెళ్లారు. రూ.15 కోట్ల విలువైన బంగారం, రూ.35 లక్షల నగదు, వెండితో వారు పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఐదుగరు దుండగులు బ్యాంకులో చొరబడి బ్యాంకు సిబ్బందిని, వినియోగదారులను తుపాకులతో బెదిరించి బంధించారు. అనంతరం కేవలం 20 నిమిషాల్లోనే బంగారం, వెండి, నగదుతో ఉడాయించారు.

మొక్కజొన్న రైతుల ధర్నా ..కాంటా చేసిన ధాన్యాన్ని తరలించాలని డిమాండ్

మొక్కజొన్న రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో నెల్లికొండ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. తూకం వేసిన ధాన్యాన్ని తరలించాలని మూడురోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నానని, తూకం చేసిన ధాన్యానికి రైతు నుంచి వేలిముద్ర వేయించుకోకుండా కాపలాగా ఉంచడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దె వాహనాల్లో మక్కలు తీసుకొచ్చిన రైతులకు కిరాయి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విమరించారు.

రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

కేబినెట్ సమావేశంలో విపక్షాల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయన్నారు. దీనికి విపక్షాలు తప్పకుండా ఫలితం అనుభవిస్తాయని అన్నారు. మహిళలకు విపక్షాలు జవాబు చెప్పాలన్నారు మోదీ. నారీశక్తి వందన్‌ బిల్లుకు ఆమోదం లభించకపోవడం దురదృష్టకరమన్నారు మోదీ.. ఈ నేపథ్యంలో రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం చేయనున్నారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తరువాత మోదీ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది..

NDA నేతల విందులో సీఎం రేవంత్ : ఢిల్లీ వేదికగా ఆసక్తికర భేటీ!

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్డీఏ కూటమి నేతలు ప్రధానంగా హాజరైన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి ఒంటరిగా వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ విందు కార్యక్రమంలో తెలుగు దేశం కేంద్ర మంత్రులతో పాటు తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలతో, కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి […]

ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ స్పందించారు. ఇది డీలిమిటేషన్‌, మహిళల హక్కుల కోసం తీసుకొచ్చిన బిల్లు కాదన్నారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని ఓడించాయని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయమని పేర్కొన్నారు. ఎన్డీయేకు ఇది చీకటి రోజు అని, వారు తీసుకొచ్చిన బిల్లు తొలిసారిగా లోక్‌సభలో ఓడిపోయిందని విమర్శించారు.

టీసీఎస్ నిదా ఖాన్ పరారీ.. పోలీసుల రాకను పసిగట్టి చాకచక్యంగా ఎస్కేప్!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాసిక్ టీసీఎస్ లైంగిక వేధింపులు, మతమార్పిడి కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ పోలీసులకు చుక్కలు చూపిస్తోంది. ఆమె ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న తరుణంలో, పోలీసులు వస్తున్నారనే విషయాన్ని ముందే పసిగట్టిన నిదా ఖాన్ అక్కడి నుంచి చాకచక్యంగా పరారైనట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా పోలీసులు నిదా ఖాన్ భర్తను ప్రశ్నించగా, ఆయన పోలీసులకు సహకరించి ఆమె ఉంటున్న లొకేషన్‌ను వెల్లడించారు. పోలీసులు వస్తున్నారని గ్రహించిన నిదా ఖాన్, ఫోన్ […]

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ V/s ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్

మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అంశంపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం ప‌తాక స్థాయికి చేరుకుంది. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే చారిత్రక అవకాశాన్ని ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాయని, కేవలం రాజకీయ లెక్కల కోసమే దేశాభివృద్ధిని పక్కన పెట్టాయని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘నారీ శక్తి వందన్ అధినియం’ విఫలం కావడానికి ప్రతిపక్షాల తీరే కారణమని, వారికి మహిళల పట్ల […]

ప్రజలను మోసం చేయకండి.. పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ గట్టి కౌంటర్!

మోదీని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రజలకు అబద్ధాలు చెప్పవద్దని, మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని, పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గిపోతుందని, దీనిపై పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. మిమ్మల్ని డిప్యూటీ సీఎంగా గెలిపించిన ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర హక్కులను పణంగా పెట్టవద్దని హితవు పలికిన ఆయన, ఈ అంశంపై తనతో చర్చకు సిద్ధమా అంటూ #justasking హ్యాష్ ట్యాగ్‌తో […]

రెండో విడత భూ సమీకరణ రైతులతో సీఎం ప్రత్యేక భేటీ

తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం అర్ధరాత్రి సమావేశం అయ్యారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. రెండో విడత భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు కౌలును ప్రకటించారు. ఎకరానికి రూ. 40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. అలాగే కుటుంబానికి రూ. 1.50 లక్షల మేర వ్యవసాయ రుణ మాఫీకి ముఖ్యమంత్రి అంగీకారం […]

అమెరికాలో గంజాయితో పట్టుబడ్డ ఎయిరిండియా కో పైలట్

గంజాయి అక్రమ రవాణా చేస్తూ అమెరికాలో ఎయిరిండియా కోపైలట్ ఒకరు పట్టుబడ్డారు. శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్టులో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోపైలట్ స్టాఫ్ ఆన్ డ్యూటీ కింద ప్యాసింజర్ క్యాబిన్‌లో ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో అతడు విమానాన్ని నడపాల్సి ఉంది. ఈ క్రమంలో శాన్‌ఫ్రాన్సిస్కో అధికారులు జరిపిన తనిఖీల్లో అతని బ్యాగ్‌లో గంజాయి పట్టబడుంది. దీంతో అధికారులు ఎయిరిండియాకు సమాచారం అందించారు.  అనంతరం అతడిని వేరే విమానంలో భారత్‌కు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON