మధ్యప్రదేశ్‌లో సింగ్రౌలీ జిల్లా బైదాన్ పట్టణంలోని వింద్యానగర్ ఏరియా లోగల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్‌లో దోపిడీ దొంగలు చొరబడి నగదుతోపాటు లాకర్‌లలోని బంగారం, వెండి ఎత్తుకెళ్లారు. రూ.15 కోట్ల విలువైన బంగారం, రూ.35 లక్షల నగదు, వెండితో వారు పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఐదుగరు దుండగులు బ్యాంకులో చొరబడి బ్యాంకు సిబ్బందిని, వినియోగదారులను తుపాకులతో బెదిరించి బంధించారు. అనంతరం కేవలం 20 నిమిషాల్లోనే బంగారం, వెండి, నగదుతో ఉడాయించారు.

