loader

లోయలో పడిన బస్సు.. ఇద్దరు మహిళలు మృతి, 31 మందికి గాయాలు

ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పింది. లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు. 31 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం 33 మంది ప్రయాణికులు ఒక బస్సులో అజ్మీర్ నుంచి పుష్కర్ వెళ్తున్నారు. పుష్కర్ ఘాటి ప్రాంతంలో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. చెట్లు, పొదల్లో అది చిక్కుకున్నది.

బాబు పుట్టినరోజు సందర్భంగా భువనేశ్వరి భారీ విరాళం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20న తన 76వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ధర్మపత్ని నారా భువనేశ్వరి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల కోసం ఆమె రూ. 76 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. చంద్రబాబు వయసు 76 ఏళ్లు కావడంతో, దానికి తగ్గట్టుగా అదే సంఖ్యలో విరాళం ఇవ్వడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

దేశంలోనే ఫస్ట్.. ఒడిశా గడ్డపై సెమీకండక్టర్ ప్లాంట్..

భువనేశ్వర్‌లోని ఇన్ఫో వ్యాలీలో దేశంలోనే మొట్టమొదటి అధునాతన 3D చిప్ ప్యాకేజింగ్ యూనిట్‌‌కు సీఎం మోహన్ చరణ్ మాఝీ, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శంకుస్థాపన చేశారు. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు బలం చేకూరుస్తూ, అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ తయారీలో ఒడిశాను ప్రపంచ గమ్యస్థానంగా నిలబెట్టే దిశగా ఈ ప్రాజెక్ట్ ఒక కీలక అడుగు. అమెరికాకు చెందిన 3D గ్లాస్ సొల్యూషన్స్ సంస్థ తన అనుబంధ సంస్థ హెటెరోజీనియస్ ఇంటిగ్రేషన్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ ద్వారా ఈ ప్లాంట్‌ను నిర్మిస్తోంది

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం..

తమిళనాడు విరుదునగర్‌లో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ధాటికి 18 మంది మృతి చెందారు. ప్రమాదంలో మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి.. సంఘటనా స్థలంలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసం అయింది.. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. అయితే.. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

మరోసారి రెచ్చిపోయిన కిమ్.. జపాన్ తీరంలో ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తన దురాక్రమణ ధోరణిని మరోసారి ప్రదర్శించారు. ఆదివారం ఉదయం ఉత్తర కొరియా జరిపిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర కలకలం రేపింది. ఏప్రిల్ నెలలోనే ఇది నాలుగో ప్రయోగం కావడం గమనార్హం. ఈ క్షిపణులు జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) వెలుపల సముద్రంలో పడ్డాయి. జపాన్ ప్రధాని సనాయే తకైచి వెంటనే అత్యున్నత స్థాయి భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేసి, సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం […]

ఇటలీలో ఇద్దరు భారతీయుల హత్య.. గురుద్వార సమీపంలో కాల్చివేత

ఇటలీ, బెర్గామోలోని కోవోలో ఇద్దరు భారతీయులు హత్యకు గురయ్యారు. ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ జీ వద్ద జరిగింది. రాగిందర్ సింగ్ (48), గుర్మిత్ సింగ్ (48) అనే ఇద్దరు వ్యక్తులు శుక్రవారం రాత్రి గురుద్వారా నుంచి బయటకు వస్తుండగా ఆయుధాలతో వచ్చిన దుండగుడు ఇద్దరిపై సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాగిందర్, గుర్మిత్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. అనంతరం దుండగుడు కారులో  పరారయ్యాడు. అయితే, హత్యకు పాల్పడింది కూడా […]

హయత్ నగర్ లో హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

కాలేజీలో అంటెడెన్స్ ఫీజులు కట్టలేదని యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నాడు.  వనస్థలిపురం శ్రీ ఇందు కాలేజీలో మ్యాదరి ప్రణీత్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో అటెండెన్స్ విషయమై కండోనేషన్ ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వడానికి యాజమాన్యం నిరాకరించింది. దీంతో హయత్ నగర్ లో తన ఇంట్లో ఉరివేసుకొని ప్రణీత్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని, కాలేజీ ముందు తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఆందోళనకు […]

ఎంపీ పురందేశ్వరికి కీలక పదవి?

రాజమండ్రి ఎంపీ మరియు ఏపీ బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి పేరు ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాల్లో మారుమోగుతోంది. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవికి ఆమె పేరును కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్రంలోని పెద్దలు ఆమె అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే, లోక్‌సభ నిర్వహణలో ఆమె పాత్ర చాలా కీలకం కానుంది.

మహిళలకు టీఎంసీ వెన్నుపోటు.. మోదీ ఆరోపణ

పశ్చిమ బెంగాల్‌లోని మహిళలకు మమతా బెనర్జీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్‌తో కలిసి మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిందని మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి మహిళలకు టీఎంసీ వెన్నుపోటు పొడిచింది. బెంగాల్ ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాకూడదని టీఎంసీ కోరుకుంటోంది. వారి మహా జంగిల్ రాజ్యాన్ని అడ్డుకుంటారనే మమతా బెనర్జీ పార్టీ ఇదంతా చేస్తోంది. ప్రజలు జంగిల్‌ రాజ్యాన్ని ఓడించాలి అని మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.

తెలంగాణ సత్తెమ్మకు నివాళులర్పించి.. పాడే మోసిన కేటీఆర్

వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి చెందిన ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సత్తెమ్మ పార్థీవ దేహానికి నివాళులర్పించిన కేటీఆర్.. స్వయంగా పాడె మోశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారని కేటీఆర్ అన్నారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ ‘జై తెలంగాణ’ నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత ఆమె. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON