loader

సుడిగాలి ప్రచారంలో మరమరాల మిక్చర్‌ను ఆస్వాదించిన మోదీ

్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్‌లో ఆదివారంనాడు సుడిగాలి ప్రచారం సాగించారు. పురూలియా, ఝార్‌గ్రామ్, మేదినీపూర్, బిష్ణుపూర్‌లలో వరుస ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రచారానంతరం ఝూర్‌గ్రామ్‌లోని ఒక చిన్న దుకాణంలో రుచిరకమైన మరమరాలు (ఝుల్‌మురిని) తింటూ కొద్దిసేపు అక్కడి స్థానికులతో మమేకమయ్యారు. బెంగాల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రుచిరకమైన స్నాక్‌గా ఝుల్‌మురికి పేరుంది. దుకాణం వద్ద స్థానికులు, మహిళలని ప్రధాని నవ్వుతూ పలకరిస్తూ స్నాక్స్‌ను వారికి కూడా పంచారు.

ఏడేళ్ల తర్వాత.. మళ్లీ జబర్దస్త్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు..

జబర్దస్త్ మానేయడానికి గల కారణాలను ఓ సందర్భంలో పంచుకున్నారు నాగబాబు. జబర్దస్త్ నిర్మాణ సంస్థతో విబేధాలు వచ్చాయని, వాటితో పాటు వివిధ కారణాలతోనే ఈ షోకు దూరమయ్యానని చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల ఓ స్పెషల్ జబర్దస్త్ ఎపిసోడ్ లో మళ్లీ కనిపించి అలరించారు మెగా బ్రదర్. . నాగబాబు జడ్జిగా జబర్దస్త్ ఎపిసోడ్ షూటింగ్ కూడా జరిగింది. ఆ షూటింగ్ కి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి నవ్వుల […]

రింకూ సింగ్ అద్భుత ఇన్నింగ్స్.. ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం

రాజస్థాన్ రాయల్స్‌‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. రింకూ సింగ్ అద్భుత హాఫ్ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో 9 పరుగులు సాధించాల్సి ఉండగా.. రింకూ సింగ్ వరుస బౌండరీలు కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. కేకేఆర్‌కు 156 పరుగుల టార్గెట్‌ను సెట్ చేసింది. రింకూ సింగ్ అద్భుత ఇన్నింగ్స్ తో కేవలం 34 బంతుల్లో 53 (5 ఫోర్లు, 2 […]

మురికివాడలో భారీ అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పుతున్న ఫైర్‌ సిబ్బంది.

నిరుపేదలు నివాసం ఉండే ఓ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో అందరూ తమ సామాగ్రిని వదిలి ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. క్షణాల్లో వాడ మొత్తం కాలిబూడిదైంది. హర్యానాలోని రేవారీ జిల్లా కోన్సివాస్‌ రోడ్డులో ఈ ఘటన జరిగింది. మురికి వాడలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

లోయలో పడిన బస్సు.. ఇద్దరు మహిళలు మృతి, 31 మందికి గాయాలు

ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పింది. లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు. 31 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం 33 మంది ప్రయాణికులు ఒక బస్సులో అజ్మీర్ నుంచి పుష్కర్ వెళ్తున్నారు. పుష్కర్ ఘాటి ప్రాంతంలో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. చెట్లు, పొదల్లో అది చిక్కుకున్నది.

బాబు పుట్టినరోజు సందర్భంగా భువనేశ్వరి భారీ విరాళం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20న తన 76వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ధర్మపత్ని నారా భువనేశ్వరి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల కోసం ఆమె రూ. 76 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. చంద్రబాబు వయసు 76 ఏళ్లు కావడంతో, దానికి తగ్గట్టుగా అదే సంఖ్యలో విరాళం ఇవ్వడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

దేశంలోనే ఫస్ట్.. ఒడిశా గడ్డపై సెమీకండక్టర్ ప్లాంట్..

భువనేశ్వర్‌లోని ఇన్ఫో వ్యాలీలో దేశంలోనే మొట్టమొదటి అధునాతన 3D చిప్ ప్యాకేజింగ్ యూనిట్‌‌కు సీఎం మోహన్ చరణ్ మాఝీ, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శంకుస్థాపన చేశారు. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు బలం చేకూరుస్తూ, అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ తయారీలో ఒడిశాను ప్రపంచ గమ్యస్థానంగా నిలబెట్టే దిశగా ఈ ప్రాజెక్ట్ ఒక కీలక అడుగు. అమెరికాకు చెందిన 3D గ్లాస్ సొల్యూషన్స్ సంస్థ తన అనుబంధ సంస్థ హెటెరోజీనియస్ ఇంటిగ్రేషన్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ ద్వారా ఈ ప్లాంట్‌ను నిర్మిస్తోంది

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం..

తమిళనాడు విరుదునగర్‌లో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ధాటికి 18 మంది మృతి చెందారు. ప్రమాదంలో మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి.. సంఘటనా స్థలంలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసం అయింది.. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. అయితే.. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

మరోసారి రెచ్చిపోయిన కిమ్.. జపాన్ తీరంలో ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తన దురాక్రమణ ధోరణిని మరోసారి ప్రదర్శించారు. ఆదివారం ఉదయం ఉత్తర కొరియా జరిపిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర కలకలం రేపింది. ఏప్రిల్ నెలలోనే ఇది నాలుగో ప్రయోగం కావడం గమనార్హం. ఈ క్షిపణులు జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) వెలుపల సముద్రంలో పడ్డాయి. జపాన్ ప్రధాని సనాయే తకైచి వెంటనే అత్యున్నత స్థాయి భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేసి, సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం […]

ఇటలీలో ఇద్దరు భారతీయుల హత్య.. గురుద్వార సమీపంలో కాల్చివేత

ఇటలీ, బెర్గామోలోని కోవోలో ఇద్దరు భారతీయులు హత్యకు గురయ్యారు. ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ జీ వద్ద జరిగింది. రాగిందర్ సింగ్ (48), గుర్మిత్ సింగ్ (48) అనే ఇద్దరు వ్యక్తులు శుక్రవారం రాత్రి గురుద్వారా నుంచి బయటకు వస్తుండగా ఆయుధాలతో వచ్చిన దుండగుడు ఇద్దరిపై సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాగిందర్, గుర్మిత్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. అనంతరం దుండగుడు కారులో  పరారయ్యాడు. అయితే, హత్యకు పాల్పడింది కూడా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON