loader

వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు

మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026కు మూడింట రెండొంతుల మెజారిటీ కావాల్సి ఉంది. కానీ ఈ బిల్లుకు కావాల్సినంత మంది సభ్యుల మద్దతు రాలేదు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌కు 528 మంది సభ్యులు హాజరు కాగా.. బిల్లు ఆమోదానికి 326 ఓట్లు కావాల్సి ఉంది. ఈ మద్దతును ఎన్డీయే కూడగట్టలేకపోయింది.

‘హార్ముజ్’ గేట్లు ఓపెన్.. కనికరించిన ఇరాన్ – ఇక లైన్ క్లియర్..!!

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించిన ప్రకారం.. అన్ని వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తూ హర్మూజ్ జలసంధిని తిరిగి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చినట్టు స్పష్టం చేశారు. లెబనాన్‌లో పరిస్థితులు శాంతించడంతో పాటు.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నంత వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా ప్రకటించారు.

రాహుల్ కు బిగ్ షాక్ ఇచ్చిన లక్నో హైకోర్టు

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి లక్నో హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై ఉన్న ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలకు సంబంధించి తక్షణమే FIR నమోదు చేయాలని కోర్టు ఉన్నత స్థాయి అధికారులను ఆదేశించింది. 2024లో కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఈ వివాదంలో ప్రాథమిక విచారణ అవసరమని భావించింది. రాహుల్ గాంధీకి బ్రిటీష్ పౌరసత్వం కూడా ఉందనేది పిటిషనర్ ప్రధాన ఆరోపణ.

టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం..

2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ కెనడా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి.కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా వేసిన ఐదో ఓవర్ ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమైంది. ఒక అంతర్జాతీయ స్థాయి బౌలర్ వరుసగా నోబాల్స్, వైడ్లు వేయడం సాధారణం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ఒక్క ఓవర్‌లోనే బజ్వా ఏకంగా 15 పరుగులు సమర్పించుకోవడం వెనుక బుకీల హస్తం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. మైదానంలో ఆటగాడి ప్రవర్తన చూస్తుంటే అది సహజంగా జరిగిన పొరపాటులా […]

ఐటీ రంగంలో “ఏఐ” ప్రకంపనలు! క్యాంపస్ హైరింగ్‌కు కంపెనీలు బ్రేక్‌!

కాలేజీ చివరి సంవత్సరంలో ఉండగానే వేలాది మందిని బల్క్‌గా కంపెనీలు తీసుకెళ్లి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాల్లో చేర్చుకునేవి. కానీ ఇప్పుడు ఆ మాస్‌ హైరింగ్‌ శకం ముగిసిందని విప్రో తీసుకున్న నిర్ణయం స్పష్టం చేస్తోంది. ప్రో చీఫ్ హ్యూమన్ ఆఫిసర్ సౌరభ్ గోవిల్ మాట్లాడుతూ… ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు చాలా అస్థిరంగా ఉన్నాయి. మునుపటిలా రెవెన్యూ పెరగాలంటే వేలాది మంది కొత్త ఉద్యోగులు అవసరం లేదు. ఏఐ సాయంతో తక్కువ మందితోనే ఎక్కువ పనిని పూర్తి చేయవచ్చని […]

పంజాబ్‌లో జోంబీలుగా కనిపిస్తున్న యువత – జోంబీ డ్రగ్ ప్రభావమేనా?

పంజాబ్‌లోని లూథియానాతో పాటు చండీగఢ్, అంబాలా వంటి నగరాల్లో ఇటీవల వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. యువకులు వింతగా ప్రవర్తిస్తూ, గంటల తరబడి కదలకుండా ఒకే స్థితిలో ఉండిపోతున్న ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. వీరంతా జోంబీ డ్రగ్ బాధితులుగా అనుమానిస్తున్నారు. వైద్య పరిభాషలో దీనిని జైలాజిన్ (Xylazine) అని పిలుస్తారు. ఇది తీసుకున్న వ్యక్తి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి, వారిని గంటల తరబడి స్పృహ లేని జోంబీ లాగా […]

పార్లమెంట్‌లో కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు చెందాల్సిన న్యాయమైన హక్కులను మోదీ సర్కార్ ఈ పునర్విభజన ప్రక్రియ ద్వారా లాక్కోవాలని చూస్తోందని రాహుల్ ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కడానికి బీజేపీ ఈ కుట్రకు తెరలేపిందని ఆయన విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన పేరిట పార్లమెంటులో తమ బలాన్ని అడ్డదారిలో పెంచుకునేందుకు అధికార పక్షం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో వారు ఆడుతున్న రాజకీయ నాటకాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

పార్లమెంట్‌లో కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ.. మహిళా బిల్లు ఒక డ్రామా అంటూ ఫైర్

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లు ముసుగులో దేశ ఎన్నికల రూపురేఖలను మార్చడానికి మోదీ సర్కార్ పెద్ద కుట్ర చేస్తోందని ఆయన బహిరంగంగా ఆరోపించారు. దేశంలో అప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే నెపంతో నియోజకవర్గాల పునర్విభజన తీసుకురావడం పూర్తి జాతి వ్యతిరేక చర్య అని ఆయన తీవ్రంగా విమర్శించారు.

మోదీని మెజిషియన్ అన్న రాహుల్ – భగ్గుమన్న బీజేపీ

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు , నియోజకవర్గాల పునర్విభజన పై జరిగిన చర్చ సందర్భంగా బాలాకోట్ నుంచి ఆపరేషన్ సిందూర్ వరకూ అన్నింటికీ మోదీ మెజిషియన్ అని రాహుల్ విమర్శించారు. మెజీషియన్ పోలికపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ .. రాహుల్ గాంధీ చేసిన మెజిషియన్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును దేశ […]

ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు

ఉప్పల్ మెట్రో స్టేషన్ కు బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేసి ఉప్పల్ మెట్రో స్టేషన్ లో బాంబు పెట్టామని బెదిరించడంతో స్థానిక పోలీసులు డాగ్ స్కాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా బాంబు పెట్టిన ఆనవాళ్లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనుమానాస్పద వస్తువలేవీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON