పంజాబ్లోని లూథియానాతో పాటు చండీగఢ్, అంబాలా వంటి నగరాల్లో ఇటీవల వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. యువకులు వింతగా ప్రవర్తిస్తూ, గంటల తరబడి కదలకుండా ఒకే స్థితిలో ఉండిపోతున్న ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. వీరంతా జోంబీ డ్రగ్ బాధితులుగా అనుమానిస్తున్నారు. వైద్య పరిభాషలో దీనిని జైలాజిన్ (Xylazine) అని పిలుస్తారు. ఇది తీసుకున్న వ్యక్తి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి, వారిని గంటల తరబడి స్పృహ లేని జోంబీ లాగా మార్చేస్తుంది.

