ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించిన ప్రకారం.. అన్ని వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తూ హర్మూజ్ జలసంధిని తిరిగి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చినట్టు స్పష్టం చేశారు. లెబనాన్లో పరిస్థితులు
శాంతించడంతో పాటు.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నంత వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా ప్రకటించారు.

