ముంబైలో ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ Blinkitకు చెందిన గోడౌన్‌పై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో తీవ్ర ఆహార భద్రత, పరిశుభ్రత లోపాలు బయటపడ్డాయి. Blinkit డార్క్ స్టోర్‌లో బొద్దింకల సంచారం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, సరిగా నిల్వ చేయని వస్తువులు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సదరు కేంద్రం ఫుడ్ లైసెన్స్‌ను FDA తక్షణమే సస్పెండ్ చేసింది. FDA కమిషనర్ తుకారాం ముంఢే నేతృత్వంలో మహారాష్ట్రలో ఆహార భద్రత నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.