అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు సత్తా చాటారు. ముఖ్యంగా డెమోక్రాట్ పార్టీ తరఫున పోటీ చేసిన భారతీయ అమెరికన్లు పలు కీలక స్థానాల్లో విజయం సాధించారు. కాలిఫోర్నియాలోని మూడో కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి అమీ బేరా, 17వ నియోజకవర్గం నుంచి రో ఖన్నా,వర్జీనియాలోని పదో నియోజకవర్గం నుంచి సుహాస్ సుబ్రహ్మణ్యం, వాషింగ్టన్ ఏడో నియోజకవర్గం నుంచి ప్రమీలా జయపాల్ విజయం సాధించారు. ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి డెమోక్రాట్ అభ్యర్థి పియా దండియా విజయం సాధించారు.

