రాజధాని ప్రాంతమంతా వరదతో మునిగిపోయిందని కొన్ని వార్తా చానల్స్, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ లో తెలిపింది. భారీ వర్షాల వల్ల రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాలలో తీసిన గోతులలో, చేసిన తవ్వకాలలో నీరు చేరిన మాట వాస్తవమేనని అంగీకరించింది. అయితే దీనిని ఆధారంగా చేసుకుని “రాజధాని అంతా మునిగిపోయింది”, “వరద బీభత్సం” అని ప్రచారం చేయడం అతిశయోక్తి అని, తప్పుడు కోణంలో చూపించడమే అవుతుందని తెలిపింది.