మురసు తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి వద్ద ఉన్న పెద్దవాగు మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు రింగ్ కట్ట తెగిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు కట్టపై ఒత్తిడి పెరిగి ఈ ప్రమాదం జరిగింది. ప్రాజెక్టు నుంచి నీరు ఒక్కసారిగా దిగువకు ఉప్పెనలా పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.