పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. “గతంలో భగవంత్ మాన్ లోక్సభలో నా పక్కనే కూర్చునేవారు. ఆయన నాతో జోకులు చెప్తున్న సమయంలో ఉదయం 11 గంటలకే ఆయన నోటి నుంచి మద్యం వాసన వచ్చేది. మద్యం తాగడం ఆయన వ్యక్తిగతం కావచ్చు. కానీ పంజాబ్లో డ్రగ్స్, మత్తు లేని వ్యవస్థ కోసం పోరాడాలనుకుంటే.. రోజు సాయంత్రం వేళల్లో మత్తులో మునిగిపోయే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే అది ఎలా సాధ్యమవుతుంది?” అని రాహుల్ గాంధీ నేరుగా ప్రశ్నించారు.

