మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఐదో సీజన్ షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేసింది. వచ్చే ఏడాది జనవరి 14న ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ ఆరంభ పోరులో ప్రస్తుత ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఫిబ్రవరి 7న జరిగే గ్రాండ్ ఫైనల్‌తో టోర్నీ ముగియనుంది. మొత్తం 22 మ్యాచ్‌లను వడోదర, ముంబై నగరాలు చెరో 11 మ్యాచ్‌ల చొప్పున ఆతిథ్యమివ్వనున్నాయి. లీగ్ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం ప్రతిరోజూ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.