భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లకు కూడా ఒకే విధమైన రాజ్యాంగ రక్షణ కల్పించే అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల తొలగింపు మాత్రం కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫార్సు ఆధారంగా జరిగిపోతుందని, దీనివల్ల కమిషనర్ల తొలగింపు ప్రక్రియలో వివక్షకు తావు ఏర్పడుతోందని పిటిషనర్ వాదించారు.