రాష్ట్ర సచివాలయంలో ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ నందన్ నీలేకని నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ సభ్యులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. పరీక్షల నిర్వహణలో పేపర్ లీకేజీలను అరికట్టడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను పటిష్టం చేయడం, డిజిటల్ ఫోరెన్సిక్స్ విభాగాలను బలోపేతం చేయడం వంటి అంశాలపై తాము ప్రత్యేక దృష్టి సారించినట్టు నందన్ నీలేకని తెలిపారు. విభిన్న రాష్ట్రాలు, భాషలు కలిగిన భారతదేశంలో అందరినీ కలుపుకొని వెళ్లేలా జాతీయ పరీక్షా సంస్కరణలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.