వైసీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు మద్యం రవాణా కుంభకోణం కేసులో ED విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఆయన నుంచి అధికారులు మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నట్లు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.195 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.