కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్లపై ర్యాగింగ్ కు పాల్పడిన 14 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఒక్కసారిగా ఇంతమందిపై చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది. విచారణలో భాగంగా జూనియర్లను ర్యాగింగ్ చేసిన ఘటనలో 14 మంది సీనియర్లను గుర్తించారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని ఆరు నెలల పాటు, మరో 10 మందిని నాలుగు నెలల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.ర్యాగింగ్ ఎదుర్కొన్న జూనియర్లు ఢిల్లీ MCIకి ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయడంతో వ్యవహారం సీరియస్ అయ్యింది.