సదర్ పండుగ అనేది కేవలం యాదవులకు మాత్రమే పరిమితమైన వేడుక కాదని, అది తెలంగాణ ఆత్మగౌరవానికి, రాష్ట్ర గుర్తింపునకు ప్రతీక అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో, అలాగే చారిత్రాత్మక గోల్కొండ కోట నిర్మాణంలో యాదవుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సదర్ ఉత్సవాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందని తెలిపారు. సదర్ అంటే కేవలం జల్సా మాత్రమే కాదని, హైదరాబాద్ సంస్కృతికి అద్దం పట్టే వేడుక అని పేర్కొన్నారు.