మియాపూర్‌లోని 550 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని విక్రయించాలని చూస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ భూములను అమ్మి సొమ్ము చేసుకోవాలని చూసే బదులు, ఆ స్థలాలను సమాజంలోని పేదలకు, ఉద్యమకారులకు మరియు అమరవీరులకు కేటాయించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే మియాపూర్ భూముల వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు.