మురసు తుపాను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రాజమహేంద్రవరంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి నగరంలో 11 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. శంభోనగర్ రైతుబజార్, రైల్వే స్టేషన్ రోడ్డు, పలు ప్రధాన రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి అమలాపురం పట్టణంలో భారీ గాలుల ధాటికి పలుచోట్ల భారీ వృక్షాలు రోడ్లపై కుప్పకూలాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

