హర్మూజ్ జలసంధిలో తాము విధించిన ఆంక్షల నుంచి భారత నౌకలకు మినహాయింపులు కల్పించినట్లు ఇరాన్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఆ జలసంధిలో భారత నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని తెలిపింది. భారత్తో పాటు చైనా, ఇరాక్, ఖతార్ దేశాల నౌకలకు ఈ రవాణా నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇరాన్ పార్లమెంట్లోని జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ ఉపాధ్యక్షుడు అహ్మద్ హయత్ మొఘద్దమ్ వ్యాఖ్యానించారు.