మురసు తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాజధాని అమరావతి ప్రాంతం జలమయమైంది. ఆకస్మిక వరదలు పోటెత్తడంతో క్లాస్ 4 ఉద్యోగుల అపార్ట్మెంట్ల గ్రౌండ్ ఫ్లోర్ వర్షపు నీటితో నిండిపోయింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ సమీప పరిసరాలు చెరువును తలపిస్తుండగా, వీఐటీ యూనివర్సిటీ వద్ద నీటి ఎత్తిపోత కోసం సిబ్బంది భారీ కెపాసిటీ మోటార్లను ఏర్పాటు చేసి నిరంతరం శ్రమిస్తున్నారు. రైతుల ఇంటి స్థలాల రోడ్లు సైతం నీట మునిగిపోయాయి. ప్రధాన రహదారులపైకి చేరడంతో అమరావతి, విజయవాడ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.