బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్‌గా బీజేపీ కార్పొరేటర్ రీతూ తావ్డే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 40 ఏళ్లలో ఈ ప్రతిష్టాత్మక పదవిని బీజేపీ దక్కించుకోవడం ఇదే మొదటిసారి. దీంతో బీఎంసీపై గత 25 ఏళ్లుగా సాగుతున్న థాకరే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది. శివసేన నేత సంజయ్ ఘాడి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. 53 ఏళ్ల రీతూ తావ్డే ఘాట్ కోపర్ వెస్ట్ నుండి మూడు సార్లు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

