ఎపిలో ఒకేసారి నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్య కుమార్ యాదవ్, కందుల దుర్గేష్‌లకు మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయి. అసలు కారకులను గుర్తించేందుకు పోలీసులు, ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగాయి. మరోవైపు మంత్రుల భద్రతను పర్యవేక్షించే అధికారులు కూడా ఈ లేఖల అసలు మూలాలను ఆరా తీస్తున్నారు. మావోయిస్టుల లేఖలు వచ్చి న కారణంగా ఆ నలుగురు మంత్రుల నివాసాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

