కోల్కతాకు చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త ప్రొఫెసర్ నీనా గుప్తా.. ప్రతిష్టాత్మక టైమ్100 నెక్స్ట్ ఇండియా 2026 జాబితాలో చోటు సంపాదించారు. 1949లో ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆస్కార్ జారిస్కీ ప్రతిపాదించిన గణిత ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన సమస్యల్లో ఒకటిగా పేరొందిన ‘జారిస్కీ క్యాన్సిలేషన్ ప్రాబ్లమ్’కు నీనా గుప్తా కీలక పరిష్కారం చూపించారు. రెండు గణిత నిర్మాణాలకు ఒకే అదనపు అంశాన్ని జోడించినప్పుడు అవి ఒకేలా మారితే, అసలు నిర్మాణాలు కూడా ఒకేలా ఉండాలా? అనే ప్రశ్న ఇది.