తాడిపత్రి పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా ఎస్పీని ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “ఏం చేసుకుంటారో చేసుకోండి.. ఏమి చేస్తాం, ఏం అవుతుంది, ఇక్కడే ఉన్నాం కదా” అంటూ సవాల్ విసిరారు. ఎలాగూ కాల్చామనే మాట ఉందని, ఇంకో నాలుగైదు కాల్చేస్తే ఏమవుతుందని వ్యాఖ్యానించారు. ఘర్షణల సమయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. గత రెండున్నరేళ్లుగా పలు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.