అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశన్నంటడంతో భారత్ చమురు, గ్యాస్ దిగుమతి బిల్లు భారీగా పెరిగింది. అక్టోబర్ నెలలో దేశ నికర చమురు, గ్యాస్ దిగుమతి బిల్లు గతేడాదితో పోలిస్తే 60శాతం పెరిగి 16 బిలియన్ డాలర్లకు చేరింది. దేశంలో LPG వినియోగం ఏప్రిల్-అక్టోబర్ కాలంలో 15.1 శాతం తగ్గింది. LPG వినియోగం తగ్గినప్పటికీ అక్టోబర్లో డీజిల్ వినియోగం 12 శాతం పెరిగి 8.5 మిలియన్ టన్నులకు చేరింది. పెట్రోల్ వినియోగం 3.5 శాతం, బిటుమెన్ వినియోగం 16.5 శాతం వృద్ధి చెందాయి.

