పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసేన కీలక ప్రకటన చేసింది. ఎక్కడైనా జనసేన శ్రేణులు స్వేచ్ఛగా పోటీ చేయవచ్చంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీకి రాజకీయపరమైన అడ్డంకులు ఉండవంటూ స్పష్టం చేశారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఉన్నట్టు.. పంచాయతీ ఎన్నికల్లో సర్దుబాట్లు, సీట్ల పంపకాలు ఉండవని తేల్చిచెప్పారు. జనసేన నాయకులు, వీర మహిళలు ఎవరైనా నామినేషన్ వేయవచ్చంటూ తేల్చి చెప్పారు. ఈ మేరకు జనసేన పేరుతో ఆదివారం ఒక అధికారిక ప్రకటన విడుదలైంది.