పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తలు తారస్థాయికి చేరాయి. బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో సంయుక్త దాడి నిర్వహించినట్లు ఇరాన్ వెల్లడించింది. అల్ రిఫా, అవాలి సైనిక స్థావరాల్లో ఉన్న అమెరికా పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు చెందిన రెండు రాడార్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. ఇరాన్ ప్రకటనపై ఎక్స్ మాధ్యమంలో ఫ్యాక్ట్-చెక్ విడుదల చేసింది. తమ విమానంపై ఎలాంటి దాడి జరగలేదని, పశ్చిమాసియాలోని అమెరికా యుద్ధవిమానాలన్నీ సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది.