టీమ్ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీలోకి రావడంతోనే చాహల్కు కీలక పదవి దక్కింది. ఆయనను బీజేబీ జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. ఈ మేరకు బీజేపీ కేంద్రీయ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. చాహల్ అంతకుముందు ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యను మర్యాదపూర్వకంగా కలిశారు.