హైదరాబాద్‌లో గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్ఛార్జ్ బి. సందీప్‌కుమార్ అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. ఈ కీలక సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ వ్యూహాలపై నేతలు ప్రధానంగా దృష్టి సారించారు.