ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2029లోపు వందశాతం ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 12 ఏళ్లలో నాలుగు కోట్లకుపైగా పక్కా ఇళ్లు నిర్మించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీయే అని పేర్కొన్నారు. “ప్రతి కుటుంబానికి భరోసా.. కూటమి ప్రభుత్వం. ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాం. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని భ్రష్టు పట్టించింది. ఎక్కడో కొండల్లో.. గుట్టల్లో మంజూరు చేసింది. నివాసయోగ్యం కాని ఇళ్లను మంజూరు చేస్తే ఎవరికైనా లాభం ఉంటుందా? కరవు సీమను సిరుల సీమగా మారుస్తామని చంద్రబాబు అన్నారు.