ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా సికె దిన్నెలో దారుణం జరిగింది. అనుమానంతో ప్రియురాలిని ప్రియుడు హత్య చేశాడు. కత్తితో గొంతు కోసి షేక్ శంషాద్ బేగంను శ్రీను చంపేశాడు. అనంతరం అతడు గొంతు కోసుకుని శ్రీను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శ్రీనుకు తీవ్రగాయాలు కావడంతో కడపలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.