అంతర్జాతీయ జంతు దినోత్సవం
అంతర్జాతీయ జంతు దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 4న నిర్వహించబడుతుంది. జంతుసంపదను పరిరక్షించడం, వాటిని వృద్ధి చేయడంతోపాటు జంతువుల హక్కులను కాపాడటం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశం అంతర్జాతీయ జంతు దినోత్సవం హీన్రిచ్ జిమ్మెర్మాన్ చే ఆవిర్భవించబడింది. అతను 1925, మార్చి 24న జర్మనీలోని బెర్లిన్ లో తొలిసారిగా దీనిని నిర్వహించాడు. దీనికి 5,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. అనంతరం ఇది 1929లో అక్టోబరు 4కు మార్చబడింది.

