సింగీతం శ్రీనివాసరావు 1931 సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు. కేవలం దర్శకుడిగానే కాకుండా రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా బహుముఖ ప్రతిభను చాటుకున్నారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన ఆయన తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో కలిపి మొత్తం 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. చలనచిత్ర రంగానికి ఆయన చేసిన విశేష సేవలకు గాను రెండు జాతీయ పురస్కారాలు, 5 నంది అవార్డులతో పాటు పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు