షేక్ హసీనాను అప్పగించాలన్న బంగ్లాదేశ్ అభ్యర్ధనను చట్టపరంగా పరిశీలిస్తున్నట్లు బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషనర్ దినేశ్ త్రివేది తెలిపారు. అందువల్ల ఆమెను అప్పగించేందుకు ఒక నిర్దిష్ట గడువును చెప్పలేమని పేర్కొన్నారు. “షేక్ హసీనా స్వదేశాన్ని వీడటంలో భారత్ పాత్ర లేదు. ఆమెను బంగ్లాదేశ్ సైనిక దళమే విమానం ఎక్కించి భారత్ కు పంపింది. ఆ సమయంలో ఆమె బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నారు. దీంతో ఆశ్రయం ఇవ్వడం మినహా మాకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది” అని అన్నారు.