సింగీతం శ్రీనివాసరావు (1931 సెప్టెంబరు 21 – 2026 అక్టోబరు 3), ప్రతిభాశాలురైన సినిమా దర్శకులలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కథాభరితమైనవీ- ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించాడు. మయూరి (1985), పుష్పక విమానం (1988), మైఖేల్ మదన్ కామరాజు (1990),ఆదిత్య 369 (1991) వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వము వహించాడు. ఇంకా ఆయన మంచి సంగీత దర్శకుడు, కథకుడు కూడా.