ఉక్రెయిన్ లోని భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా డ్రోన్లు దాడికి పాల్పడ్డాయి. సుమీలో ఉన్న కుసుమ్ గ్రూప్ నకు చెందిన ఫార్మా ప్లాంట్ పై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ప్లాంట్ చాలా వరకు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. భారతదేశానికి చెందిన రాజీవ్ గుప్తా 1994 నుంచి ఉక్రెయిన్ కు ఔషధాలు సరఫరా చేసేవారు. ఆ తర్వాత అక్కడే సొంతంగా కంపెనీ ఏర్పాటు చేశారు.