తిరుప్పూర్ జిల్లాలో నిర్వహించిన ఉప ఎన్నికల బహిరంగ ప్రచార సభలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తోన్న సమయంలో ఓ బాలుడు ఆయన వాహనంపైకి ఎక్కాడు. తన మెడలో ఉన్న కండువాను ఆ బాలుడి మెడలో వేశారు ఉదయనిధి స్టాలిన్. తన కాలర్ మైక్ ను ఆ బాలుడి ముందు ఉంచి మాట్లాడించారు. ముఖ్యమంత్రి విజయ్ పట్ల కూడా అవమానకరంగా, ఆయనను కించపరిచేలా ఓ చిన్నారితో మాట్లాడించారని టీవీకే నేతలు ధారాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.